Eruvaka Sagaro… ఏరువాక సాగారో…
Eruvaaka Saagaaro… ఏరువాక సాగారో… కొసరాజు రాఘవయ్య సినీ గేయ సర్వస్వం సినిమా గేయ సాహిత్యంలో ఆణిముత్యాల లాంటి పాటలతో చిరకాలం నిలిచిపోయే వ్యక్తి కొసరాజు రాఘవయ్య. ఆ పాటలు అందరికి అందుబాటులో ఉండాలని ఆయన రాసిన అన్ని సినిమా పాటలను సంకలనంగా ప్రచురించాం. జానపద కవి సార్వభౌమ, కవిరత్న వంటి బిరుదులతోపాటు ఎన్నో సన్మానాలు పొందిన కొసరాజు, సినిమా పాటల రచయితగా ప్రసిద్ధి పొందినప్పటికీ ఇతర ఎన్నో రచనలు చేశారు. చిన్ననాటనే రాసిన కవితల వల్ల బాలకవి అన్న పేరు పొందారు. 1939లో రైతుబిడ్డలో పాటలతో మొదలైన సినీరంగ ప్రవేశం పదేళ్లు పైబడిన అంతరాయంతో 1954లో పెద్ద మనుషులతో మళ్లీ అందుకుని అప్రతిహతంగా కొనసాగింది. 1986లో ఆయన చనిపోయేవరకు సినిమా పాటలు రాస్తూనే ఉన్నారు. ఆయన పాటలు రాసిన సినిమాలు కొన్ని ఆయన చనిపోయిన తరవాత విడుదలయ్యాయి. ఈ సుదీర్ఘ కాలంలో కొసరాజు రాసినవిగా నిర్ధారితమైనవి 489 సినిమాలలోని 867 పాటలు ఈ పుస్తకంలో ఉన్నాయి. ఏ పాటనైనా వెతుక్కోటానికి విషయసూచికతో పాటు పుస్తకం చివరలో సినిమా పేరు, పాట పేరుతో సూచికలు కూడా ఇచ్చాం. సినీ, సంగీత కళాభిమానులు ఈ పుస్తకాన్ని స్వాగతిస్తారని ఆశిస్తున్నాం,
Specifications
- Age Group
- Adults
- Book Author
- Kosaraju Raghavaiah
- Pages
- 594
AI Readiness
Good foundation, but some important product data is still missing.