Sanyas Upanishad

Sanyas Upanishad

200.00 INR In stock Buy at Merchant

హిందూ ధర్మ శాస్త్రాలలో ఉపనిషత్తులు ఒక భాగములు. మనకు 108 ఉపనిషత్తులు ఉన్నాయి. 108 ఉపనిషత్తులలో సన్యాస ఉపనిషత్ ఒకటి. పూర్వకాలంలో ఈ ఉపనిషత్తులను శిష్యులు గురువు ముందు కూర్చోని జ్ఞానాన్ని ఆర్జించారు. అలాగే ఇప్పుడు శ్రీశ్రీశ్రీ పరమపూజ్య మహా ప్రేమావతార స్వయంభూః ఆదిపరబ్రహ్మ జైమహావిభోశ్రీః వారు సత్య ఓమౌజయులకు ఆ సన్యాస ఉపనిషత్లోని విభాగాలైన అవధూత ఉపనిషత్, తురీయాతీత ఉపనిషత్, జాబాల ఉపనిషత్ లను బోధించడం జరిగింది. ఈ ఉపనిషత్లలో సన్యాసి అంటే ఎవరు, సన్యాసి విధి విధానాలు ఏమిటి, ఎన్ని రకాల సన్యాసులు ఉన్నారు అనే విషయాలను వివరించారు. దానినే “ఓమౌజయాః సన్యాస ఉపనిషత్” అనే ఈ భక్తి గ్రంథములో పొందుపరచడం జరిగింది. ఆధ్యాత్మిక ప్రాథమిక దశలో ఉన్న ఆధ్యాత్మిక జిజ్ఞాసువులకు మరియు సత్యాన్వేషపరులకు చక్కని మార్గదర్శకత్వం అందిస్తుంది. “ఓమౌజయాః సన్యాస ఉపనిషత్” పశుతత్త్వాన్ని మరియు రాక్షసత్వాన్ని మనుషుల నుండి వేరు చేసి మనుషులలో మానవత్వాన్ని, దైవత్వాన్ని స్థాపిస్తుంది. అదేవిధంగా సమాజంలో ఉన్నటువంటి నేరప్రవృత్తిని మరియు నీచపు తత్త్వాన్ని సమూలంగా నాశనం చేసి మంచితనాన్ని మరియు విలువలతో కూడిన సమాజాన్ని స్థాపించడానికి మార్గదర్శకత్వం చేస్తుంది. ప్రతిరోజూ ఒక శ్లోకమును స్మరిస్తూ పారాయణం చేస్తూ, ధ్యానిస్తూ, అర్థం చేసుకొని సత్ భక్తి భావనతో శ్లోక పరమార్ధమును ఆచరించిన ఎడల ఆధునిక సమాజంలో, వైజ్ఞానిక కాలంలో భక్తి శ్రమ ఫలితమును అనుభూతి చెంది ఆనందించే అవకాశం ప్రతి ఒక్కరికి ఉంటుంది అనేది నగ్న సత్యం భక్తి, శ్రద్ధ, విశ్వాసము, శరణాగతి, కృతజ్ఞత, పవిత్రత, సర్వ సమర్పణము, త్యాగము అనే భావాలను హృదయములో ప్రతిష్టించుకొని సేవ, దానం, ధ్యానం, సత్సంగం, సత్ప్రచారం అను జీవన సత్య సూత్రాలను ఆత్మలో ఆచరించినప్పుడు మానవులందరు ఋజుమార్గంలో ప్రయాణం చేసి సత్య జీవితమును జీవించి, ఆత్మానుభూతిని ఆనందిస్తూ, భగవంతుని ప్రేమకు పాత్రులై మానవజన్మకు పరమ గమ్యమైన మోక్షమును ప్రాప్తింపచేసుకోగలరు. జన్మించిన ప్రతి మానవుడు మానవ జన్మ సర్వ సఫలతను మరియు ఆనందములను అనుభూతి చెంది జ్ఞానవంతుడై ఆత్మచైతన్యం ద్వారా పరిపూర్ణ మానవత్వంతో వికాసం పొందగలరని, సభ్యత సంస్కారంతో కూడుకున్న సమాజం ఏర్పడాలని, ప్రత్యక్ష భగవంతుడు స్వయంభూః సద్గురు దేవుల అనుగ్రహం మరియు ఆశీర్వాదం అందరికీ ప్రాప్తించాలని సర్వ మానవాళి సచ్చిదానందంగా జీవించి తరించాలని స్వయంభూః ఆదిపరబ్రహ్మ జైమహావిభోశ్రీః కరుణా కటాక్షములు అందరిపై ఉండాలని ప్రార్థిస్తూ విశ్వకళ్యాణమును ఆకాంక్షిస్తూ, మానవ కళ్యాణముకు ప్రయత్నిస్తూ, ఆత్మ కళ్యాణములో భాగస్వామ్యులు అవుతూ, ప్రకృతి కళ్యాణములో పాల్గొంటూ, ప్రపంచ కళ్యాణముకై సదా తపిస్తూ ప్రయాణిస్తున్నాము. లోకా సమస్త సుఖినోభవంతు… సర్వేజనా సుఖినోభవంతు.. అందరిపై ఓమౌజయాః ప్రేమ దీవెనలు ఉండును గాక! ఇట్లు ఓమౌజయాః మహాధర్మ సేవలో ఓమౌజయాః సత్య ఓమౌజయుల బృందం ఓమౌజయాః ఏకోపాసన మహాధర్మం

AI Readiness

Good foundation, but some important product data is still missing.

72%