Meher Prabhu Charitham -Vol 17 (Telugu) మెహెర్ ప్రభుచరితము by భావూ కల్చురి (PB)
మెహెర్ ప్రభు చరితం” శీర్షికలో ప్రచురింపబడిన సంపుటులలో ఇది చిట్ట చివరి సంపుటి. ఈ సంపుటిలో లార్డ్ మెహర్ ఇండియన్ ఎడిషన్ 4446 పేజీ నుండి నువ్వా4788 పేజీలలో ఉన్న విషయాలు కలవు. బాబా చరాచర సృష్టి కోసం, అలాగే ప్రతి ఒక్కరి కోసం ఏ విధంగా పనిచేశారో మనం తెలుసుకోవడానికి, అర్థం చేసుకోవడానికి ఈ సంపుటి మనకు ఎంతగానో దోహదపడుతుంది. ప్రభు చరితం గత సంచికలలో బాబా ఇచ్చిన అనేక ప్రజాదర్శన కార్యక్రమాల గురించి, బాబా నుండి వెల్లువలా ప్రవహించిన ప్రేమ ప్రవాహంలో ప్రేమికులు తడిసి ముద్దయినట్లు తెలుసుకున్నాం- - - - - - –ఈసంచికలో బాబా తన దామన్ ను మనం గట్టిగా పట్టుకొని ఉండడానికి మన అందరితో ఆంతరిక సంబంధాన్ని నెలకొల్పడానికి’ ఏకాంతవాసాన్ని’ మాధ్యమంగా చేసుకోవడం గురించి తెలుసుకుంటాం. విశ్వకార్యభారపు ఒత్తిడి శరీరంపై ఎక్కువగా ఉండి శారీరక బాధలతో విశ్రాంతి లేకుండా ఉన్నప్పటికీ, తన ప్రేమికులకు ఎలా అందుబాటులో ఉండేవారో మనం ఈ సంచికలో చూడవచ్చును. పాశ్చాత్య దేశాలలో అధికశాతం యువతను పట్టిపీడిస్తున్న మాదకద్రవ్యాల వాడకాన్ని నివారించడానికి, మాదకద్రవ్యాల వాడకానికి బానిసలైన అమాయక యువతను ఆ అలవాటు నుండి బయటపడేయడానికి ప్రాధాన్యత నిచ్చే తగిన రీతిలో పనిచేయడం ఈ సంచికలో చూడవచ్చును. ‘ మాదకద్రవ్యాలు మానసిక ఉత్తేజాన్ని ఇస్తాయి’ అనే నమ్మకాన్ని ఖండిస్తూ బాబా ఇలా అన్నారు: “ నీటికి ఎండమావి ఎంత దూరమో, డ్రగ్స్ వల్ల కలిగే అనుభవాలు వాస్తవికతకు అంతే దూరంలో ఉంటాయి. మీరు ఎండమావిని ఎంత దూరం వెంబడించినా మీ దాహాన్ని ఎప్పటికీ తీర్చుకోలేరు. అదేవిధంగా డ్రగ్స్ ద్వారా సత్యాన్ని అన్వేషించలేరు.” —పూనా సెంటర్ ను బాబా తన స్వహస్తాలతో ప్రారంభించడం, తరువాత రోజు గురుప్రసాద్ లో ప్రేమికులకు దర్శనం ఇవ్వడం అతి మనోహరంగా ఈ సంచికలో వర్ణించబడ్డాయి. ఒక మచ్చుతునక—-- పూనా కేంద్రానికి బాబాను ఆహ్వానిస్తూ కేంద్ర సెక్రటరీ కె. కె. రామకృష్ణన్ ఇలా అన్నాడు: “ మా అందరి హృదయాల్లో నివసించే ఓ బాబా! నిన్ను స్వాగతించడానికి వేరుగా ఒక ప్రదేశం ఎక్కడ ఉంది? సమస్త విశ్వాన్ని నీలోనే ఇముడ్చుకున్న నీకు ఏది ఆసనంగా ఉపయోగపడుతుంది?” బాబా సమాధానం:” మీలోని ప్రతి ఒక్కరూ మీ జీవితంలో నాకు ఒక స్థానానికి, మీ ప్రతి హృదయంలో ఒక ఆసనానికి నన్ను స్వాగతిస్తున్నారు. మీ హృదయాలలో అధివసించడానికి, మీ జీవితాల్లో పాలు పంచుకోవడానికి నేను మీ మధ్యకు వచ్చాను.” – బాబాకు చరాచర సృష్టి పై గల అపారమైన కరుణను, ప్రేమను ఈసంపుటి చదివితే మనం అనుభూతి చెందవచ్చును. – సంపుటిలో చివరి అధ్యాయంలో అవతారుని భౌతిక జీవితంలో చివరి రోజులు, అప్పుడు జరిగిన సంఘటనలు చదువరుల హృదయాలను ద్రవింప చేసేలా వివరించబడ్డాయి. – బాబా జీవిత చరిత్ర చదువుతూ బాబా సాన్నిద్యం, సాన్నిహిత్వం చదవ రుల సొంతం అనే విషయాన్ని ప్రత్యేకంగా చెప్పవలసిన పనిలేదు.
Variants (1)
- Default Title — 300.00 INR — In stock
AI Readiness
Good foundation, but some important product data is still missing.